T-hub | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ జియోస్పేషియల్, ఇండస్ట్రియల్ టెక్నాలజీస్ కంపెనీ హెక్సాగాన్ సీసీఐ…టీహబ్‌తో కలిసి స్టార్టప్ క్యాటలిస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకుగాను నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 స్టార్టప్‌లను ఎంపికచేశారు. 100 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో డిజిటల్ ట్విన్, రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అంశాల్లో స్టార్టప్‌లలో కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఆల్గోర్యాండ్ స్టార్టప్ ల్యాబ్
బ్లాక్ చైన్ టెక్నాలజీతో స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహించే వారిని ప్రోత్సహించేందుకు టీ హబ్‌లో ఆల్గోర్యాండ్ స్టార్టప్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని టీహబ్ ప్రతినిధి తెలిపారు. ఎంపిక చేసిన స్టార్టప్‌లకు ప్రొడక్ట్, మార్కెట్- ఫండింగ్ అంశాల్లో నిపుణుల సహకారంతోపాటు మద్దతును అందించేలా ఆల్గోర్యాండ్ స్టార్టప్ ల్యాబ్ పనిచేస్తుందని తెలిపారు. వివరాలకు (https:// pro grams.t-hub.co/ algorand – start up-lab/)లో సంప్రదించాలని సూచించారు.