Hero Maestro Xoom | ప్రముఖ దేశీయ టూ వీలర్స్ కంపెనీ హీరో మోటో కార్ప్ తన ఫిఫ్ట్ మోడల్ స్కూటర్ `మ్యాస్ట్రో జూమ్`ను మార్కెట్లోకి తీసుకొస్తున్నది. ఈ స్కూటర్‌ను హీరో మోటో కార్ప్ ఈ నెల 30న విపణిలో ఆవిష్కరించడానికి రంగం సిద్ధమైంది. మ్యాస్ట్రో జూమ్ బ్యాడ్జితో వస్తున్న మ్యాస్ట్రో ఫ్యామిలీలో మూడవది. గతేడాది సెప్టెంబర్‌లో తన డీలర్ల కోసం ప్రైవేట్ ఈవెంట్లో మ్యాస్ట్రో జూమ్ స్కూటర్‌ను హీరో మోటో ప్రదర్శించింది. ఈ సందర్భంగా సదరు స్కూటర్ స్టైల్ తదితర ఫీచర్లు బయటకు వచ్చాయి.
మ్యాస్ట్రో జూమ్ స్కూటర్ 110 సీసీ సెగ్మెంట్లో వస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరో మోటో స్కూటర్ల మాదిరిగా పలు మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. హెడ్ ల్యాంప్‌ను ఆప్రోన్ దిగువన ఉండొచ్చునని అంచనా. హ్యాండిల్ బార్ ఫెయిరింగ్‌పై హెడ్ ల్యాంప్ ఎడ్జ్ ఉంటుందని సమాచారం. టు-టోన్ పెయింట్ స్కీమ్, హ్యాండిల్‌బార్‌పైనే ఇండికేటర్లు వస్తాయి.
హెచ్-ప్యాటర్న్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో మ్యాస్ట్రో జూమ్ స్కూటర్ వస్తుందని తెలుస్తున్నది. స్కూటర్ 12-అంగుళాల వీల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. మ్యాస్ట్రో ఎడ్జ్ 100 మాదిరిగానే మ్యాస్ట్రో జూమ్ స్కూటర్‌కు కూడా 110సీసీ సామర్థ్యం గల ఇంజిన్ అమరుస్తారని సమాచారం. మ్యాస్ట్రో ఎడ్జ్110లో మాదిరిగానే సింగిల్ సిలిండర్, ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ 7500 ఆర్పీఎం వద్ద 8 బీహెచ్పీ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 8.75 ఎన్ఎం పీక్ టార్చి వెలువరిస్తుందని భావిస్తున్నారు.