న్యూఢిల్లీ, మార్చి 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో ఒక్కరోజు, నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి, మూడు నెలల రుణాలపై రేటు 8.70 శాతం, ఆరు నెలల రేటు 8.80 శాతానికి చేరుకున్నది. ఏడాది రుణాలపై వడ్డీరేటును 8.95 శాతానికి పెంచిన బ్యాంక్..రెండేండ్ల రుణాలపై రేటు 9.05 శాతానికి, మూడేండ్ల రుణాలపై వడ్డీని 9.15 శాతానికి సవరించింది.