GST On medicines | పలు ఔషధాలపై జీఎస్టీ తగ్గిస్తూ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి ఇది సరైన టైం కాదని సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ ఆర్డర్లపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.. సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు
కండరాల క్షీణతను నివారించడానికి దిగుమతి చేసుకునే ఔషధాలపై పన్ను మినహాయింపు. ఆంఫోటెరిసిన్-బీ, టోలిసిలిజుమాబ్, రెమ్‌డెసివిర్, హెపారిన్ వంటి యాంటీ కాగులెంట్స్లపై జీఎస్టీ మినహాయింపు డిసెంబర్ 31 వరకు కొనసాగింపు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కెయ్ట్రుడా, తదితర ఔషధాలపై తగ్గింపు.
ఆరోగ్య శాఖ సిఫారసు చేసిన ఏడు ఇతర ఔషధాలపై ఐజీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గింపు.
బయోడీజిల్ బ్లెండింగ్ కోసం వినియోగించే డీజిల్‌పై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింపు
లోకోమోటివ్స్, ఇతర విడి భాగాలపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంపు.
రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీకి మినహాయింపు. ఎయిర్పోర్ట్, ఇతర దిగుమతులపై డబుల్ టాక్స్ నుంచి మినహాయింపు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే స్కిల్ డెవలప్మెంట్ పథకాలపై జీఎస్టీ రాయితీ.జనవరి నుంచి ఫుట్‌వేర్, టెక్స్టైల్ సెక్టార్లపైఇన్వర్టెడ్ డ్యూటీ సర్దుబాటుతో జీఎస్టీలో మార్పులు అమలు.