New Income Tax Bill | పాత ఆదాయం పన్ను చట్టానికి ఇక చెల్లు చీటేనా.. బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు
New Income Tax Bill | పాత ఆదాయం పన్ను చట్టాన్ని సరళతరం చేస్తూ.. అందరికి సులభంగా, స్పష్టంగా అర్థమయ్యేలా కొత్త ఆదాయం చట్టం తేవడానికి కేంద్రం సన్నద్దమైంది. ఇందుకు బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.
New Income Tax Bill | ఆదాయం పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త ఆదాయం పన్ను చట్టం రానున్నదా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ‘కొత్త ఆదాయం పన్ను బిల్లును ప్రతిపాదించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయం పన్ను చట్టాన్ని సరళతరం చేసి కొత్త చట్టం తీసుకొస్తారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పేజీల సంఖ్యను సుమారు 60శాతం తగ్గించి, సమగ్ర ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు.
ఆరు నెలల్లో పాత చట్టాన్ని సమీక్షిస్తామన్న నిర్మలమ్మ
2024 జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆరు నెలల్లో పాత ఆదాయం పన్ను చట్టం-1961పై సమగ్రంగా సమీక్షిస్తామని ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెడతారు. కొత్త ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు తప్ప ప్రస్తుత చట్టానికి సవరణలు కాదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ముసాయిదా బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉంది. మలి విడత బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెడతారని తెలుస్తున్నది.
31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకూ జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ కొనసాగుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి బడ్జెట్ సమర్పిస్తారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకూ మలి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తే చట్టంగా మారుతుంది.
పాత చట్టం సమీక్షకు సీబీడీటీ ఆధ్వర్యంలో కమిటీ
పాత కాలం నాటి ఆదాయం పన్ను చట్టం -1961పై సమీక్షించి సమగ్ర నివేదిక తయారు చేయడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక అంతర్గత కమిటీ నియమించింది. సంక్షిప్తంగా, స్పష్టంగా తేలిగ్గా అర్ధం చేసుకునే విధంగా ప్రతిపాదిత బిల్లు ఉంటుంది. వివాదాలు, వ్యాజ్యాలు తగ్గించడానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తారు. పాత ఆదాయం పన్ను చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 స్పెషలైజ్డ్ సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చట్టం సమీక్షించడానికి ప్రజల నుంచి 6500 సూచనలు వచ్చాయి. ప్రస్తుతం చట్టం 298 సెక్షన్లు, 23 చాప్టర్లు కలిగి ఉంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ఆదాయం పన్ను చట్టం-1961లో వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్, గిఫ్ట్ టాక్స్, వెల్త్ టాక్స్ వస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

