Google Chrome Update | ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్పింగ్ కోసం ఎక్కువ మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్నే వాడతారు. ఆన్లైన్ షాపింగ్ మొదలు ఆరోగ్యం తదితర విషయాలు క్రోమ్ బ్రౌజర్లోనే వెతికి తెలుసుకుంటారు. అయితే ఈ బ్రౌజర్లో లోపాలు ఉన్నాయని, వాటివల్ల యూజర్ల డేటా హ్యాకర్లు చేజిక్కించుకునే అవకాశం ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఐఎన్) ఓ ప్రకటనలో తెలిపింది.
క్రోమ్ బ్రౌజర్లో కొన్ని లోపాలున్నాయి. ఉచిత వెబ్ యాప్స్, యూజర్ ఇంటర్ఫేస్, విండోస్ మేనేజర్, స్క్రీన్ క్యాప్చర్, ఫైల్ ఏపీఐ, ఆటో ఫిల్, డెవలపర్స్ టూల్స్ వంటి పేర్లతో మాల్వేర్లు క్రోమ్ బ్రౌజర్లో యూజర్ డేటా సేకరిస్తున్నట్లు గుర్తించినట్లు సీఈఆర్టీ-ఐఎన్ వెల్లడించింది. వీటి వల్ల క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్ల సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అందుకే యూజర్లు వెంటనే తమ బ్రౌజర్లను అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే వారి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరొచ్చని సీఈఆర్టీ-ఐఎన్ పేర్కొంది. గూగుల్ క్రోమ్ కూడా యూజర్లు తమ బ్రౌజర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. తాము 22 రకాల సెక్యూరిటీ లోపాలను సరిచేసినట్లు గూగుల్ క్రోమ్ తెలిపింది.