Google Vids | టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఏఐ ఆధారిత యాప్ గూగుల్ విడ్స్ను లాంఛ్ చేసింది. ఈ నూతన యాప్ టెక్ట్స్ ప్రాంప్ట్స్ నుంచి వీడియోలను క్రియేట్ చేస్తుంది. గూగుల్ విడ్స్ యాప్‌ను ప్రధానంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ను ఫోకస్ చేస్తూ గూగుల్ లాంఛ్ చేసింది. న్యూ వర్క్‌స్పేస్ యాప్ గూగుల్ విడ్స్ను లాంఛ్ చేస్తున్నట్టు గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.
ఏఐని వాడుతూ యూజర్లు తమ వర్క్ కోసం ఈ యాప్ ద్వారా వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఆపై యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా వీడియోలను ఎడిట్ చేసకోవచ్చు. ఈ వీడియోలకు యూజర్లు తమ సొంత వాయిస్ ఓవర్‌ను కూడా జోడించవచ్చు.
మీరు సులభంగా ఎడిట్ చేసుకునే వెసులుబాటుతో గూగుల్ విడ్ స్టోరీబోర్డ్ను జనరేట్ చేస్తుందని గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ యాప్‌లో వీడియో, రైటింగ్, ప్రొడక్షన్, ఎడిటింగ్ అసిస్టెంట్ అన్నీ ఉంటాయని తెలిపింది. మీ బ్రౌజర్ నుంచి ప్రాజెక్టులను సురక్షితంగా షేర్ చేసుకోవచ్చని తెలిపింది. వీడియో జనరేషన్ టూల్‌ను జూన్‌లో విడుదల చేస్తామని బ్లాగ్‌పోస్ట్ పేర్కొంది.
Read More :