హైదరాబాద్, ఆగస్టు 5: ఫ్లోరింగ్ సొల్యూషన్కు సంబంధించి ఉత్పత్తుల తయారీ సంస్థ వెల్స్పన్ గ్రూపునకు గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు వరించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) నిర్వహించిన బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో అత్యంత గౌరవమైన ఈ అవార్డు లభించినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా కంపెనీ హెడ్ ఉత్పల్ హల్దార్ మాట్లాడుతూ.. బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు మా నిరంతర నిబద్దతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.