రూ.2,500 తగ్గిన పుత్తడి
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడంతో మదుపర్లు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఇతర వాటికి మళ్లించడంతో వీటి ధరలు పడిపోతున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 1 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడంతో మదుపర్లు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఇతర వాటికి మళ్లించడంతో వీటి ధరలు పడిపోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో సోమవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.53 శాతం తగ్గి రూ.1,60,400 లక్షలకు పడిపోయింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఇది రూ.1,62, 900గా ఉన్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ.820 తగ్గి రూ.1,60,900గా నమోదైంది.
వెండి పరుగుకు బ్రేక్
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు అంతేవేగంతో దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు లేదా 2 శాతం తగ్గి రూ.2,69,700గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.2,74,700గా ఉన్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు భయాందోళనకు గురయ్యాయని, ఫలితంగా అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరుగడం కూడా లోహాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం తగ్గి 4,504.97 డాలర్లకు పడిపోగా, వెండి మాత్రం ఒక్క శాతం ఎగబాకి 75.93 డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

