న్యూఢిల్లీ, అక్టోబర్ 8 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ఒక్కసారిగా దూసుకుపోయింది. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు పుంజుకోవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణం. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.3,600 ఎగబాకి రూ.1,52,500 పలికింది.
బుధవారం గోల్డ్ ధర రూ.1,48,900గా ఉన్నది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో కొనుగోళ్లు ఊపందుకోవడం ధరలు పెరుగడానికి దోహదం చేశాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.కిలో వెండి రూ.3 వేలు పడిపోయి రూ.2.24 లక్షలకు పరిమితమైంది. అంతకుముందు ఇది రూ.2.27 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగి 4,112 డాలర్లకు చేరుకోగా, వెండి 58.50 డాలర్లకు పడిపోయింది.