Gold Prices | న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చింది. ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు కొనుగోళ్లకు ముందుకురాకపోవడంతో డిమాండ్ అనూహ్యంగా పడిపోయింది. దీంతో ధరలు తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం ఒకేరోజు తులం బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.80,050కి దిగింది. బంగారంతోపాటు వెండి కూడా భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.2,000 తగ్గి రూ.99,000కి తగ్గింది. అంతకుముందు వెండి రూ.1.01 లక్షలుగా ఉన్నది. ఆభరణాలు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీనంగా ఉండటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆభరణాల విక్రయదారుడు వెల్లడించారు.