Gold-Silver Rates | ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభంలో బంగారం, వెండి ధరలు ధగధగమెరుస్తున్నాయి. శనివారం (2024 ఏప్రిల్ 6) దేశీయ బులియన్ మార్కెట్లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.1200 పెరిగి రూ.65,350లకు చేరుకున్నది. మరోవైపు 24 క్యారట్ల మేలిమి బంగారం తులం ధర రూ.1310 పెరిగి రూ.71,290 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఏప్రిల్ నెల తొలి ఆరు రోజుల్లోనే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.3300, 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.3600 పెరిగాయి.
ఇంతకుముందు మార్చి 29న 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1300, 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1,420 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ బంగారం ధర 2300.49 డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు ఇంట్రా డే ట్రేడింగ్లో 2304.09 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.1800 పెరిగి రూ.83,500లకు చేరుకుంది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.66,150 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.72,160 పలికింది. ముంబైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.65,350 చేరితే, 24 క్యారట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.71,290 వద్ద ముగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (22 క్యారట్స్) ధర రూ.65,500, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71,440 వద్ద ముగిసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారట్స్ బంగారం తులం ధర రూ.65,350, 24 క్యారట్స్ బంగారం రూ.71,290 కోట్లకు చేరుకున్నది.