Gold price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే..!
Gold price | భారత మార్కెట్లో ఇవాళ (మంగళవారం) బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ధరలు పెద్దగా మార్పులు లేకుండా నిలకడగా ఉన్నాయి.
Gold price : భారత మార్కెట్లో ఇవాళ (మంగళవారం) బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ధరలు పెద్దగా మార్పులు లేకుండా నిలకడగా ఉన్నాయి. తాజా మార్కెట్ గణాంకాల ప్రకారం దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,920గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,090 వద్ద నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,920గా, 22 క్యారెట్ల ధర రూ.1,30,090గా కొనసాగుతోంది. అయితే ఇక్కడ వెండి ధర మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే అధికంగా ఉంది. కిలో వెండి ధర రూ.2,44,900 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,070 ఉండగా, ముంబై, కోల్‌కతాలలో రూ.1,41,920 వద్ద కొనసాగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యధికంగా రూ.1,45,080గా ఉంది. స్థానిక పన్నులు, తయారీ ఛార్జీల ఆధారంగా ధరలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని, కొనుగోలుదారులు లావాదేవీలకు ముందు అధీకృత డీలర్ల వద్ద తాజా ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

