ముంబై, డిసెంబర్ 16: గోల్డ్ బాండ్ గ్రాము ధరను రూ.5,409గా నిర్ణయించింది రిజర్వుబ్యాంక్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను మూడోసారి సావరిన్ గోల్డ్ బాండ్లను ఈ నెల 19-23 వరకు ఐదు రోజులపాటు విక్రయించనున్నారు.
ఆన్లైన్లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి ప్రతిగ్రాముపై రూ.50 రాయితీ ఇస్తున్నది. ఇలాంటివారు గ్రాముకు రూ.5,359 చెల్లిస్తే సరిపోతున్నది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్నది. అలాగే నాలుగో విడుత గోల్డ్బాండ్లను వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 10 వరకు విక్రయించనున్నారు.