Prices Increase | న్యూఢిల్లీ, మార్చి 10: సబ్బుల ధరల్ని క్రమేణా పెంచాలని గోద్రెజ్ కన్జ్యూమర్ భావిస్తున్నది. పామాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లాభాలను నిలుపుకోవడానికి ఉత్పత్తుల ధరల్ని మరింతగా పెంచడమే మార్గంగా సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో వరదల కారణంగా గతకొద్ది నెలలుగా మార్కెట్లో పామాయిల్ ధరలు పెరుగుతూపోయాయి. దీంతో హిందుస్థాన్ యునీలివర్, గోద్రెజ్ కన్జ్యూమర్ వంటి కంపెనీలు ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి.
‘పెరిగిన ఉత్పాదక వ్యయం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు’ అని గోద్రెజ్ కన్జ్యూమర్ సీఈవో సుధీర్ సీతాపతి తమిళనాడులో రాయిటర్స్‌తో అన్నారు. దీంతో మున్ముందు ఆ కంపెనీ సబ్బుల ధరలు పెరుగుతాయని చెప్పకనే చెప్పినైట్టెంది.