AI | ఏఐ మానవ మేథను అధిగమించదు : మస్క్ అంచనాను తోసిపుచ్చిన ఏఐ గాడ్‌ఫాదర్
AI : ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ జనరేటివ్ టూల్ చాట్‌జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ భవిష్యత్‌ను నిర్ధేశిస్తుందని పలువురు టెక్ నిపుణులు చెబుతుండగా, ఏఐతో కొలువుల కోత తప్పదని మరికొందరు బాంబు పేల్చుతున్నారు.
AI : ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ ఏఐ జనరేటివ్ టూల్ చాట్‌జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ భవిష్యత్‌ను నిర్ధేశిస్తుందని పలువురు టెక్ నిపుణులు చెబుతుండగా, ఏఐతో కొలువుల కోత తప్పదని మరికొందరు బాంబు పేల్చుతున్నారు. ఇక మరో ఐదేండ్లలో ఏఐ మానవ మేథను అధిగమిస్తుందని ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. మస్క్ అంచనాతో ఏఐ గాడ్‌ఫాదర్‌గా పేరొందిన మెటా ఏఐ చీఫ్ యాన్ లికున్ విభేదించారు.
అదే జరిగితే, 17 ఏండ్ల వయసున్న వ్యక్తి తరహాలో కేవలం 20 గంటల ప్రాక్టీస్‌తో డ్రైవింగ్ చేయడం నేర్చుకునే ఏఐ సిస్టమ్‌లు ప్రపంచంలో ఉన్నాయని యాన్ లికున్ చెప్పారు. మన వద్ద మిలియన్ల కొద్దీ గంటల లేబుల్ శిక్షణ డేటా ఉన్నప్పటికీ, మనకు ఇంకా పూర్తిగా స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతతో కూడిన సెల్ఫ్ డ్రైవింగ్ లేదని గుర్తుచేశారు. అత్యున్నత మేథతో కూడిన ఏఐ ఆలోచనను లికున్ కొట్టిపారేయడం ఇదే తొలిసారి కాదు. మానవులను ఏఐ అధిగమిస్తోందనే మస్క్ భయం అర్ధరహితమని గతంలోనూ లికున్ తోసిపుచ్చారు.
నిర్వహణా లోపం కలిగిన విమానం కంటే ఏఐ మరింత ప్రమాదకరమని, ఇది మానవాళి విధ్వంసానికి పూనుకునే సామర్ధ్యం కలిగిఉందని టకర్ కార్ల్‌సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ పేర్కొన్నారు. అయితే మస్క్ అంచనా సరైంది కాదని నిక్ బాస్ట్రమ్ పుస్తకం సూపర్‌ఇంటెలిజెన్స్ ప్రభావంతో వారు ఇలాంటి అంచనాలు వేస్తున్నారని వెంచర్ క్యాపిటలిస్ట్ హ్యారీ స్టెబ్బింగ్స్కు ఇచచిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో లికున్ తేల్చిచెప్పారు.
Read More :
Tamilisai Soundararajan | ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AI
- Elon Musk
- humans
- Intelligence
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

