న్యూఢిల్లీ, మార్చి 9: దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎంట్రీ-లెవల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా మోడల్‌కు ముందస్తు బుకింగ్‌లు ఆరంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా దగ్గర్లో ఉన్న కంపెనీ అవుట్లెట్లలో రూ.11 వేలు ముందస్తుగా చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సంస్థ సూచించింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లలో లభించనున్నది. 2019లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ ఇప్పటి వరకు 66 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.