హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లాండ్ ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.205 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.192 కోట్ల కంటే ఇది 7 శాతం అధికమని పేర్కొంది. కంపెనీ ఆదాయం రూ.1,384 కోట్ల నుంచి రూ.1,545 కోట్లకు ఎగబాకింది.