Amara Raja | న్యూఢిల్లీ, జూన్ 24: జీఐబీ ఎనర్జీ ఎక్స్ స్లోవాకియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో జీఐబీ ఎనర్జీ ఎక్స్‌కి చెందిన సబ్సిడరీ సంస్థ గోటియాన్ హై-టెక్ కో లిమిటెడ్ లిథియం-అయాన్ సెల్ టెక్నాలజీ పంచుకోనున్నాయి. దీంతో అమర రాజా ప్రపంచస్థాయి ఎల్ఎఫ్పీ సెల్స్‌ను తయారు చేయడానికి వీలు పడనున్నది.
కొనుగోలుదారులకు హీరో షాక్
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.1,500 వరకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే కొన్ని మాడళ్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.