Maruti Car Discounts | కస్టమర్ల మనస్సు గెలుచుకోవడంలోనూ, రెప్యూటేషన్ కాపాడుకోవడంలోనూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంలోనూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫస్ట్ మార్కులు పడతాయి. మారుతి ఆల్టో 800, మారుతి స్విఫ్ట్ సహా పలు మారుతి సుజుకి బ్రాండ్ కార్లను లక్షల మంది కస్టమర్లు అంతగా ప్రేమిస్తారు మరి. ఎప్పటికప్పుడు కస్టమర్ల మనస్సెరిగి.. అందుకు అనుగుణంగా కార్లను డిజైన్ చేయడానికి గల అవకాశాలను ఏమాత్రం వదులుకోదు. వినియోగదారులను శాటిస్పై చేయడానికే మొగ్గు చూపుతుంది.
ఒకవైపు కర్బన ఉద్గారాల నియంత్రణకు రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు అమలు చేస్తున్నా.. మరోవైపు తమ కార్లపై భారీ స్థాయిలో డిస్కౌంట్లు అందిస్తున్నది మారుతి సుజుకి. ఇగ్నీస్, బాలెనో, సియాజ్ వంటి మోడల్ కార్లకు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన కార్లు డిస్కౌంట్ మీద అందుబాటులోకి రావడం అద్భుతమైన అవకాశం. ఇంకెందుకు ఆలస్యం.. మీ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న కారు ఎంచుకోవడం బెస్ట్.. మారుతి సుజుకి వివిధ కార్లపై ఇస్తున్న డిస్కౌంట్లు, రాయితీలపై ఓ లుక్కేద్దామా.. !
మారుతి సుజుకి ఇగ్నీస్ కారుపై గరిష్టంగా రూ.35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4000 వరకు లభిస్తుంది.
ఎక్స్ లెంట్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ గల బాలెనో మోడల్ కారు కొనాలనుకుంటున్నారా.. అయితే క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేల వరకు లభిస్తుంది. అందులో ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు కలిసి ఉంటుంది.
అన్ని రకాల సియాజ్ వేరియంట్ కార్లపై డిస్కౌంట్ బోనస్ రూ.25 వేలు అందుబాటులో ఉంది. మీకు మరింత సమాచారం కావాలంటే, సమీపంలోని మారుతి నెక్సా షోరూమ్ కి వెళ్లండి. పూర్తి వివరాలు తెలుసుకుని మీకు ఇష్టమైన కారు బుక్ చేసుకోండి.