ఎఫ్‌పీఐలు యూటర్న్
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
- జనవరిలో రూ.13 వేల కోట్ల నిధులు వెనక్కి
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
– వీకే విజయ కుమార్, జియోజిట్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అధికారి
న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఉత్సుకతను ప్రదర్శించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు యూటర్న్ తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా భారీగా నిధులు కుమ్మరించిన ఎఫ్ఐఐలు..ప్రస్తుత నెలల ఏకంగా వేలాది కోట్ల నిధులను తరలించుకుపోయారు. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెంచడంతో ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్ఐఐలు రూ.13,047 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి వేలాది కోట్ల రూపాయలను తరలించుకుపోయిన ఎఫ్ఐఐలు..డెబిట్ మార్కెట్లో మాత్రం పెట్టుబడులు పెట్టడం విశేషం.
ఈ నెల 1 నుంచి 19 వరకు ఎఫ్ఐఐలు డెబిట్ మార్కెట్లో రూ.15,647 కోట్ల నిధులు కుమ్మరించారు. డిసెంబర్ నెలలో రూ.66,134 కోట్ల నిధులు కుమ్మరించిన ఎఫ్ఐఐలు..అంతకుముందు నెల నవంబర్లోనూ రూ.9 వేల కోట్లు చొప్పించారు. మరోవైపు డిసెంబర్లో డెబిట్ మార్కెట్లోకి రూ.18,302 కోట్లు, నవంబర్‌లో రూ. 14,860 కోట్లు, అక్టోబర్‌లో రూ.6,381 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద 2023లో ఎఫ్ఐలు ఈక్విటీ మార్కెట్లోకి రూ.1.71 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగా..డెబిట్ మార్కెట్లోకి రూ.68,663 కోట్ల నిధులను చొప్పించారు.
2022లోనూ 1.21 లక్షల కోట్లు వెనక్కి
2022లో ఎఫ్ఐఐలు చుక్కలు చూపించారు. అంతర్జాతీయంగా పలు సెంట్రల్ బ్యాంక్‌లు కీలక వడ్డీరేట్లను పెంచడంతో 2022లో ఎఫ్ఐఐలు ఏకంగా రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. మరోవైపు, గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం సర్వసాధారణమని, వడ్డీరేట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఎఫ్ఐఐలు వేచి చూసే దోరణిలో ఉన్నారని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇతర మార్కెట్ల కంటే భారత్ సూచీలు అంచనాలకుమించి రాణిస్తున్నప్పటికీ ప్రస్తుతం దిద్దుబాటు దోరణిలో ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

