న్యూయార్క్ : ఎంతటి కుబేరులైనా ఏదో ఒక పని చేస్తూ సంపదను కాపాడుకుంటూ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్‌కు (Steve Ballmer) మాత్రం ఏమీ చేయకుండానే ఈ ఏడాది ఏకంగా దాదాపు 8000 కోట్లు వచ్చిపడ్డాయి.
టెక్ దిగ్గజం నుంచి ఆయనకు బిలియన్ డాలర్ల విలువైన (రూ. 8000 కోట్లు) వార్షిక డివిడెండ్లు రానున్నాయి. మైక్రోసాఫ్ట్‌లో అత్యధిక వ్యక్తిగత వాటాదారైన బాల్మర్‌కు కంపెనీలో 4 శాతం విలువైన 333.2 మిలియన్ షేర్లున్నాయి.
బార్మర్ వాటా విలువ ఈ ఏడాది 130 బిలియన్ డాలర్లకు ఎగబాకడంతో ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద ఏకంగా 44 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర ఏకంగా 56 శాతం పెరగడంతో బార్మర్ సంపాదన కూడా ఎగబాకింది. 1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బా్మర్ ఆపై అంచలంచెలుగా ఎదుగుతూ 2000లో కంపెనీ సీఈవో పగ్గాలు చేపట్టి 2014లో వైదొలిగారు.
Read More :