ముంబై, జూన్ 3: దేశంలోని విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు గత నెల 27తో ముగిసిన వారంలో 3.854 బిలియన్ డాలర్లు ఎగిసి 601.363 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వారాంతపు గణాంకాలను విడుదల చేసింది.
అంతకుముందు వారం 4.230 బిలియన్ డాలర్లు ఎగబాకి 597.509 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. కాగా, బంగారం నిల్వలు, ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)ల్లో పెరుగుదల ఇందుకు కారణంగా ఆర్బీఐ పేర్కొన్నది. మే 27తో ముగిసిన వారంలో ఎఫ్సీఏ 3.61 బిలియన్ డాలర్లు పెరిగి 536.988 బిలియన్ డాలర్లకు చేరాయి. గోల్డ్ రిజర్వ్‌లు 94 మిలియన్ డాలర్లు పుంజుకుని 40.917 బిలియన్ డాలర్లను తాకాయి.