విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. నాలుగు నెలల తర్వాత మళ్లీ 600 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించాయి. డిసెంబర్ 1 నాటికి ఫారెక్స్ నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 11న 600 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయిన తర్వాత మళ్లీ ఇప్పుడే అధిగమించాయి.
మరోవైపు, అక్టోబర్ 2021లో రికార్డు స్థాయి 642 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ కంటే రూపాయి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నదని, దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం కారణమని దాస్ వెల్లడించారు.