Savings A/c | ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ..!
Savings A/c | ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేటును తగ్గించి వేసింది. ప్రస్తుతం 2.90 శాతం...

Savings A/c | ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేటును తగ్గించి వేసింది. ప్రస్తుతం 2.90 శాతం వడ్డీరేటు మాత్రమే అందిస్తున్నది. ఇంతకుముందు మూడు శాతం వడ్డీ అందించేది. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలని అనుకున్నారనుకోండి.. ఆయా బ్యాంకులు ఎంత వడ్డీ ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోవాలి.. మనం ఆ పని ఇప్పుడే చూసేద్దామా..!
బ్యాంక్- – – – – – – – – – అందిస్తున్న వడ్డీరేటు (శాతం)
ఆర్బీఎల్ బ్యాంక్ – – – – 4.25-6.00
బంధన్ బ్యాంక్ – – – – – 3.00-6.00
ఇండస్ ఇండ్ బ్యాంక్ – – 4.00-6.00
యెస్ బ్యాంక్ – – — – – – 4.00-5.50
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ – – 4.00-5.00
పోస్టాఫీసు – – – – – – – – – 4.00
ఐసీఐసీఐ బ్యాంక్ – – – – – 3.00-3.50
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – – – – 3.00-3.50
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 2.90
బ్యాంక్ ఆఫ్ ఇండియా – – 2.90
ఎస్బీఐ – – – – – – – – – – – 2.70
ప్రతి నెలా సగటు మొత్తం నిల్వలు మీ బ్యాంకులో ఉంచాలి. ఇది బ్యాంకులను బట్టి ఎక్కువ. తక్కువ ఉంటుంది. కనీస నిల్వ మొత్తం తక్కువ పెట్టేందుకు అనుమతించే బ్యాంకులోనే సేవింగ్స్ ఖాతా తెరవాలి. సేవింగ్స్ ఖాతాలో నిర్దిష్ట నిల్వలు లేకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలవారీ సగటు నిల్వ నిబంధనలో తేడాలు ఉంటాయి.
సేవింగ్స్ ఖాతాలో వడ్డీపై పన్ను ఇలా
ఆదాయం పన్ను చట్టంలోని 80టీటీఏ సెక్షన్ కింద సేవింగ్స్ ఖాతాలో మొత్తంపై వచ్చే వడ్డీ ఆదాయానికి పరిమితి ఉంది. రూ.10 వేలు దాటిన డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందే. ఉమ్మడి హిందూ కుటుంబ (హెచ్‌యూఎఫ్) సభ్యులు, 60 ఏండ్ల లోపు వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మాత్రం రూ.50 వేల వరకు మినహాయింపు ఉంది. ఈ పరిధి దాటితే వారి ఖాతాల నుంచి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

