న్యూఢిల్లీ, మే 12 : ఆహార పదార్థాలు భగ్గుమంటున్నాయి. గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ స్వల్పంగా పెరిగి 3.48 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో 3.40 శాతంగా ఉన్న ధరల సూచీ..ఏడాది క్రితం నమోదైన స్థాయిలోనే ఉన్నది.
దీంట్లో ఆహార పదార్థాల ధరల సూచీ మాత్రం 3.8 శాతం నుంచి 4.2 శాతానికి ఎగబాకినట్టు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది.