ముంబై, ఏప్రిల్ 14: ఫోక్స్‌వ్యాగన్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. స్పోర్ట్స్ ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విడుదల చేసిన ఈ టైగున్ ఆర్-లైన్ మాడల్ కారు ధర రూ.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, త్రీ-జోన్ ైక్లెమెట్ కంట్రోల్, ఐడీఏ వాయిస్ అసిస్టెంట్, 15 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్స్‌తో తయారైన ఈ కారు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ రకాల్లో లభించనున్నది. భద్రత ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ కారులో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు-వెనుక డిస్క్ బ్రేకులు, లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కాగా, టారిఫ్ వార్ భారత్‌పై దృష్టిసారిస్తున్నామని సంస్థ చెప్తున్నది.