బెంగళూరు, సెప్టెంబర్ 6: ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్…తాజాగా హోటళ్ళను బుకింగ్ సేవలను ఆరంభించింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ పేరుతో ప్రత్యేక సేవలు ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయంగా ఉన్న 3 లక్షల హోటళ్ళకు సంబంధించిన సమాచారంతోపాటు గదులను బుకింగ్ చేసుకోవచ్చును. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది.