సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఆయా బ్యాంకులు ఎఫ్డీలపై ఆకర్షణీయంగా 7 శాతం వరకు వడ్డీరేటును వృద్ధుల కోసం ఆఫర్ చేస్తున్నాయి. అంతేగాక నెలనెలా బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. త్రైమాసిక, అర్ధవార్షిక పద్ధతుల్లో ఆదాయాన్ని పొందే వెసులుబాటు ఉన్నది. పైగా వైద్యం, పిల్లల పెండ్లిళ్లకు కావాల్సిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కూడా ఎఫ్డీలు ఉంటుండటం విశేషం. అలాగే వేగంగా రుణాలు పొందేందుకూ ఈ ఎఫ్డీలు దోహదపడుతున్నాయి. ఎఫ్డీలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవచ్చు. తక్కువ వడ్డీరేట్లకే ఈ లోన్లనూ అందుకోవచ్చు.