Festive Sales -21 Worst | ప్రతిఏటా ఫెస్టివ్ సీజన్లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ సగటున తమ సేల్స్ రెట్టింపు అవుతాయని ఆశలు పెట్టుకుంటాయి. కానీ 2021 ఫెస్టివ్ సీజన్ గత దశాబ్ద కాలంలోనే తొలిసారి తమకు దారుణ ఫలితాలనిచ్చిందని ఆటోమొబైల్ సంస్థల డీలర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న సెమీ కండక్టర్ల కొరత, ఎంట్రీ లెవెల్ కార్లకు డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని డీలర్లు చెబుతున్నారు.
ఎస్యూవీ, కంపాక్ట్-ఎస్యూవీ, లగ్జరీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) పేర్కొంటున్నది. ఈ విభాగాల కార్ల కొరత వల్ల తాము చురుగ్గా బిజినెస్ చేయలేకపోతున్నామని అంటున్నారు డీలర్లు. మరోవైపు ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ తక్కువగా ఉండటంతోపాటు కరోనా నేపథ్యంలో కుటుంబాలు ఆరోగ్య పరిరక్షణ అవసరాల కోసం నగదు తమ వద్ద అందుబాటులో ఉంచుకుంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ పేర్కొన్నారు.
2020తో పోలిస్తే గత నెలలో వాహనాల సేల్స్ 5.33 శాతం తగ్గిపోయాయి. 2019 అక్టోబర్‌లో 18.6 లక్షల వాహనాలు విక్రయిస్తే, 2020లో 14.4 లక్షల కార్లు, ఈ ఏడాది 13.6 లక్షల కార్లను వివిధ కార్ల తయారీ సంస్థల డీలర్లు విక్రయించారు. అంటే గత నెలలో కార్ల సేల్స్ తగ్గిపోయాయన్నమాట.
ఇక పెట్రోల్ రేట్లు మూడంకెల స్థాయికి పెరగడంతో గ్రామీణుల్లో టూ వీలర్స్ డిమాండ్ పడిపోతున్నది. దీనికి తోడు కరోనా నేపథ్యంలో మున్ముందు అవసరాల కోసం.. ఆరోగ్య పరిరక్షణ అవసరాలకు కొంత నగదు నిల్వలను ప్రజలు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో టూ వీలర్స్ సేల్స్ పది లక్షల్లోపే. 2019 అక్టోబర్‌లో 14 లక్షల టూ వీలర్స్ అమ్ముడైతే.. ఈ ఏడాది 30 శాతం తగ్గిపోయాయి.
గతేడాదితో పోలిస్తే త్రీ వీలర్స్ క్యాటగిరీ వాహనాలకు డిమాండ్ ఉంది. అదే టైంలో ఐసీఈ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు త్రీ వీలర్స్ కొనుగోలుదారులు ఆసక్తిగా ఉన్నారు. త్రీ వీలర్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాల షేర్ 45 శాతం దాటి పోయిందని వింకేశ్ గులాటీ వెల్లడించారు.
వాహన శ్రేణి– అక్టోబర్ 2021 – అక్టోబర్ 2020 – వార్షిక వృద్ధి – అక్టోబర్ 2019
టూ వీలర్స్ —- 9,96,024 — – — 10,60,337 —- -6.07% — — 14,23, 668
త్రీ వీలర్స్ —- 39,077 —– —- — 22,467 —– 73.93% — 63,040
ప్యాసింజర్ వెహికల్స్ – 2,28,431 — 2,57,756 —- -11.38% — 2,74,033
ట్రాక్ వెహికల్స్ — 44,262 ——– 55,874 —— -20.78% – – — 35,469
కమర్షియల్ వెహికల్స్ – 56,732 —– — 44,865 ——- 26.45% —- 63,888
ఎల్సీవీ ——— 34,162 —– —- 32,835 —– —- 4.04% — — 40,547
ఎంసీవీ ———- 3694 ——- — 2051 —— — 80.11% – — 3246
హెచ్‌సీవీ —— 15,874 ——- 7163 —— —– 121.61% — — 17735
ఇతర వాహనాలు —- 3002 —— 2816 ——- 6.61% — 2360
మొత్తం వెహికల్స్ — 13,64,526 — —- 14,41,299 ———– -5.33% — 18,60,098