న్యూఢిల్లీ : ప్రముఖ గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లకు చెందిన హైఎండ్ సూపర్ కార్లకు దేశీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో ప్లగిన్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కూపే 296 జీటీబీని ఫెరారి లాంఛ్ చేసింది. ఎఫ్8 ట్రిబ్యుటో స్ధానంలో ఫెరారీ 296 జీటీబీని లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. రూ 5.4 కోట్ల ధరకు లభించే ఈ సూపర్ కార్ మిడ్ రియర్ ఇంజిన్డ్ బెర్లినెట్టా డిజైన్ స్ఫూర్తితో కస్టమర్ల ముందుకొచ్చింది.
స్టీరింగ్‌కు టచ్ కంట్రోల్స్‌తో పాటు అల్కాంటర ఎలక్ట్రిక్ సీట్లు, సస్పెన్షన్ లిఫ్టర్, బ్లాక్ సిరామిక్ ఎగ్జాస్ట్ పైప్‌లు, కార్బన్-ఫైబర్ ఫ్రంట్ స్పాయిలర్, సరౌండ్ వ్యూ కెమెరా, టైటానియం వీల్ బోల్ట్స్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఫెరారి లేటెస్ట్ కారు కేవలం 2.9 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగం అందుకుంటుంది. గంటకు 330 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో ఈ కారు దూసుకుపోతుంది.