Mercedes Benz | పండుగ సీజన్ నేపథ్యంలో జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ (Mercedes-Benz) భారత్ మార్కెట్లో తన జీఎల్ఈ ఎస్ యూవీ, సీ43 4మ్యాటిక్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ కార్లను ఆవిష్కరించింది. బెంజ్ జీఎల్ఈ ఎస్యూవీ కారులో ఒక పెట్రోల్, రెండు డీజిల్ ఇంజిన్లతోపాటు మూడు పవర్ ట్రైన్ ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇక మెర్సిడెస్ ఏఎంజీ సీ43 4 మ్యాటిక్ మోడల్ కారులో కూపే స్టైల్ తలుపుకు బదులు 4డోర్ సెడాన్ డోర్లు అందిస్తున్నది.
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఫేస్ లిఫ్ట్ కారు.. బీఎండబ్ల్యూ ఎక్స్5, ఆడీ క్యూ7, వోల్వో ఎక్స్ సీ 90 మోడల్ కార్లతోనూ.. ఆడి ఎస్5 స్పోర్ట్ బ్యాక్, బీఎండబ్ల్యూ3 సిరీస్ ఎం340ఐ మోడల్ కార్లతో మెర్సిడెజ్ ఏఎంజీ సీ43 4 మ్యాటిక్ కారు పోటీ పడతాయి.
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ కారు మూడు వేరియంట్లు జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్, జీఎల్ఈ 450డీ 4మ్యాటిక్, జీఎల్ఈ 450 4 మ్యాటిక్ వర్షన్లలో ప్రవేశ పెట్టారు. ఈ కారు ధర రూ.96.40 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ వేరియంట్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ రూ.1.15 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
మరోవైపు మెర్సిడెజ్ ఏఎంజీ సీ43 4 మ్యాటిక్ కారు రూ.98 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. రెండు మోడల్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 300డీ, జీఎల్ఈ450 వేరియంట్ కార్లు ప్రస్తుత ఫెస్టివ్ సీజన్ లో డెలివరీ చేస్తారు. జీఎల్ఈ 450డీ వేరియంట్ కారు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో డెలివరీ ప్రారంభిస్తారు.
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఎస్యూవీ కారు సింగిల్ స్లాట్ గ్రిల్లె, న్యూ డిజైన్ హెడ్ లైట్స్ విత్ రీ డిజైన్డ్ ఫ్రంట్ బంపర్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్ లేదా 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆప్షనల్ గా జత చేస్తారు. రేర్ లో న్యూ డిజైన్ టెయిల్ ల్యాంప్స్, బంపర్స్ లభిస్తాయి.
న్యూ స్టీరింగ్ వీల్ విత్ టచ్ హ్యాప్టిక్ కంట్రోల్, 12.3 అంగుళాల ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే ఉంటుంది. 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 590 వాట్ల 13-స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రేర్ సీట్స్, యూఎస్బీ సీ చార్జ్ పోర్ట్, హెడ్ అప్ డిస్ ప్లే, క్లైమేటైజ్డ్ సీట్స్, ఎయిర్ మాటిక్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉంటాయి.
ప్రయాణికుల సేఫ్టీ కోసం 9- ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ సహా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి పలు అడాస్ ఫీచర్లు ఉంటాయి. 2023 మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ మోడల్ కార్లు మల్టీపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లు (పెట్రోల్, డీజిల్, ప్లగ్ ఇన్ హైబ్రీడ్) కలిగి ఉంటాయి. కానీ భారత్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో కూడిన కార్లను ఆవిష్కరించారు. ఆల్ త్రీ ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి.
మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ సీ43 4 మ్యాటిక్ సెడాన్ కారు పనామెరికానా గ్రిల్లె, బంపర్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ లో ఇంటిగ్రేటెడ్ క్వాడ్ ఎగ్జాస్ట్ సెటప్, ఎఎంజీ బ్యాడ్జింగ్, ఎల్ఈడీ హెడ్ లైట్స్ విత్ ఎల్ షేప్డ్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్; గ్లాస్ బ్లాక్ ఓఆర్వీఎంస్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఏఎంజీ స్పెషిఫిక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ స్పోర్ట్ సీట్స్ విత్ రెడ్ స్టిచింగ్ అండ్ రెడ్ సీట్ బెల్ట్స్ ఉంటాయి. 710 వాట్ల 15 స్పీకర్ బర్మెస్టర్ 3డీ సౌండ్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కోసం ఎఎంజీ స్పెషల్ డిజిటల్ గ్రాఫిక్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 4.6 సెకన్లలో 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.