Instagram : సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటి సేవలు నిలిచిపోయాయి. యూజర్లకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫీడ్ లోడ్ కావడం లేదు. దీంతో చాలా దేశాల్లోని యూజర్లు మెటా సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇండియాతోపాటు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, యూకే వంటి పలు దేశాల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీడ్ లోడ్ కావడం లేదు.
యూజర్లకు కంటెంట్ రిఫ్రెష్ అవ్వడం లేదు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ రకమైన ఇబ్బంది తలెత్తిందని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక దేశాల్లో వెబ్‌లో, మొబైల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలు రావడం లేదని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలు ఆన్లైన్, సోషల్ మీడియా ట్రాకింగ్ సైట్లు కూడా ధృవీకరించాయి. కొందరు యూజర్లు లాగిన సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు. కంటెంట్ క్రియేటర్లు చాలా ఇబ్బందులు ఈ పరిణామంపై చిరాకు పడుతున్నారు. ఎక్స్ సహా ఇతర ప్లాట్‌ఫామ్స్ వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
అయితే, ఈ అంశంపై మెటా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో మెటా ఎప్పుడు ఈ సమస్యను పరిష్కరిస్తుందా అని యూజర్లు ఎదురుచూస్తున్నారు. డిజిటల్ యుగంలో యూజర్లు సోషల్ మీడియా వాడకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి ఉంది. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఎదురవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.