న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : మొబైల్ ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి రూ. 2 లక్షల కోట్ల విలువైన ఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి కాగా, వీటిలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంతక్రితం ఏడాది ఎగుమతైన ఫోన్లతో పోలిస్తే 54 శాతం అధికమన్నారు. గడిచిన పదేండ్లలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ ఐదింతలు పెరగగా, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయన్నారు.