Personal Finance | మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పటికీ అలాగే ఉండిపోవాల్సిందేనా? సంపన్నులు కావాలంటే ఏం చేయాలి?
Personal Finance | సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. మిడిల్‌క్లాస్ కుటుంబాలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఇవి.
Personal Finance | సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. మిడిల్‌క్లాస్ కుటుంబాలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఇవి. కానీ, అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు పెట్టుబడులు పెట్టొద్దా..? షేర్ మార్కెట్ జోలికి రావొద్దా? ఎస్ఐపీ ఊసెత్తొద్దా? ఆదాయం దండిగా ఉన్నవాళ్లకే అవి పరిమితమా? మరి లేనివాళ్ల సంగతేంటి..
‘ఎంతచెట్టుకు అంత గాలి!’.. ఈ సూత్రం కుటుంబ ఆర్థిక వ్యవహారాలకూ వర్తిస్తుంది. సరిపడా సంపాదించకుండా, ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అనుకుంటూ ఉంటే… దశాబ్దాలు గడుస్తున్నా ఆర్థిక పరిస్థితి మారదు. మూరెడు సంపాదనతో బారెడు ఆస్తులు సృష్టిస్తామని అనుకోవడం పొరపాటే! నెలకు వచ్చే రూ.15 వేలల్లో 30 శాతం అంటే రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తానంటే.. మిగిలింది కుటుంబానికి ఏ మూలకు సరిపోతుంది.
అందుకే, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పొదుపుపై దృష్టి సారించాలే కానీ, మదుపు చేస్తామంటే పరిస్థితి మరింత అదుపు తప్పుతుంది. మరి వీరి జీవితాలు అలాగే ఉండిపోవొద్దంటే ఏం చేయాలి? ముందుగా అత్తెసరు ఆదాయం నుంచి బయటపడాలి. రాబడి మార్గాలు పెంచుకోవాలి.
ఉద్యోగానికి బై..
ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. డిగ్రీ పట్టా చేతిలో పట్టుకొని గుమాస్తాగా వెళ్లదీస్తానంటే.. బతుకు జట్కాబండీలా తయారవుతుంది. సంపద సృష్టించాలి. రిస్క్ తీసుకోను.. తక్కువైనా నమ్మకంగా ఖాతాలో పడే జీతం చాలని సర్దిచెప్పుకొంటే.. సంవత్సరాలు గడిచినా బతుకు చిత్రంలో ఏ మార్పూ కనిపించదు. రూ.18 వేలు, రూ.20 వేలు వేతనం ఉన్నవాళ్లు ముందుగా ఆ ఉద్యోగంలోంచి బయటపడాలి. సొంతకాళ్లమీద నిలబడాలి.
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో టీ కొట్టు పెట్టుకున్నా నెలకు రూ.30వేలు సంపాదనకు గ్యారెంటీ ఉంటుంది. ఫుట్‌పాత్ మీద దోసెలు అమ్ముకునే వ్యక్తి సైతం నెలకు రూ.40 వేల వరకు సంపాదించగలుగుతున్నాడు. ఉద్యోగం వదులుకోవడానికి మనసొప్పకపోతే.. మీ టాలెంట్‌ను గుర్తించి దాని ఆధారంగా ఎంతోకొంత అదనపు సంపద సృష్టించుకోవచ్చు. అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం లేదని వాపోవడం కన్నా… అందుకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలోనే తృప్తి ఉంటుంది.
రాబడి మార్గాలు బోలెడు
ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయితే.. సాయంత్రాలు ట్యూషన్ చెప్పుకోవచ్చు. సంగీతంలో పరిజ్ఞానం ఉంటే.. మ్యూజిక్ స్కూల్ నడపొచ్చు. వంటల్లో ఆరితేరిన వారైతే పొడులు, పచ్చళ్లు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకొని.. దాని ద్వారా కూడా ఆదాయం ఆర్జించినప్పుడే ఒక మెట్టు పైకి ఎదుగుతాం. అంతేకానీ, వచ్చే ఇరవై వేలల్లో నాలుగు వేలు ఎస్ఐపీ కడతానంటే.. ఈ పదహారు వేలతో మీ ఇల్లు గడవడం దుర్భరం అవుతుంది. తినే తిండి, కట్టుకునే బట్ట, పిల్లల చదువు ఇలా అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది.
ఉత్సాహమే పెట్టుబడి..
ఒక ముప్పయ్యేండ్ల వ్యక్తి గృహ నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ ఆదాయం రూ.900. నెలకు రూ.21 వేల వరకు వస్తుంది. అతని భార్య కుట్టుమిషన్ కుడుతుంది. ఆమెకు నెలకు రూ.4వేలు వస్తాయి. జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఓ లక్షన్నర కూడబెట్టారు. ఈ పాతికవేలల్లో రూ.5వేలు ఎస్ఐపీ చేశాడనే అనుకుందాం. ఇరవై ఏండ్ల తర్వాత అతనికి 11.50 లక్షలు చేతికొస్తాయి. అయితే.. పదేండ్ల తర్వాత 40 ఏండ్లకు వచ్చే ఆ వ్యక్తి, ఇప్పుడున్నంత ఉత్సాహంగా పనిచేయకపోవచ్చు.
పిల్లలు పెరుగుతారు. ఖర్చులూ అధికమవుతాయి. అప్పుడు ఆదాయం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు ఎలా మదుపు చేయగలడు. కూడబెట్టిన లక్షన్నరకు, ఓ ప్రైవేట్ చిట్ ద్వారా రెండు లక్షలు జతచేసి.. గృహ నిర్మాణ సామగ్రి తీసుకోవచ్చు. వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. నిర్మాణ రంగంలోనే ఉన్నాడు కాబట్టి గిరాకీ ఉండదన్న సమస్య రాదు. పదేండ్లు పూర్తయ్యే నాటికి రోజుకు రూ.3వేలు అద్దె వచ్చేలా పరికరాలు సమకూర్చుకోగలిగితే.. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పదిరోజులు ఎవరూ అద్దెకు తీసుకోలేదు అనుకున్నా నెలకు దాదాపు రూ.60వేలు సమకూరుతాయి.
దీనికి దంపతుల ఆదాయం కలిస్తే.. ఆ కుటుంబం మధ్యతరగతి జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. డబ్బులు సంపాదించాలనే ఉత్సాహం ఉండాలి. చాలీచాలని బతుకుల నుంచి గట్టెక్కాలన్న ఆలోచన రావాలి. దానిని పక్కాగా అమలు చేస్తే… దిగువ మధ్యతరగతి దగ్గరే ఆగిపోవాల్సిన పరిస్థితి ఉండదు.
కుటుంబానికి భరోసా
దిగువ మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. వైద్యం ఖర్చుల గురించి బెంగ అవసరం లేదు. ఎందుకైనా మంచిది అనుకుంటే.. ఆరోగ్యబీమా తీసుకోవచ్చు. ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) నియమాలను అనుసరించి బీమా కంపెనీలు పరిమిత మొత్తంతో జీవిత బీమా ఆఫర్ చేస్తున్నాయి. ఆదాయం తక్కువైనా, చదువు లేకున్నా రూ.25 లక్షల వరకు జీవిత బీమా ఇస్తున్నాయి. దీనికి నెలకు రూ.200 నుంచి రూ.600 వరకు ప్రీమియం చెల్లిస్తే చాలు. దీంతో కుటుంబానికి భద్రత కలుగుతుంది. పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, మీ కోసం అటల్ పెన్షన్ యోజన తదితర ప్రభుత్వ ఆధారిత స్కీమ్‌లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తుపై బెంగ లేకుండా ఉండొచ్చు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Personal Finance Tips | కట్టిన ఇల్లు కొంటే లాభమా? కడుతున్నప్పుడే ఇంటిని బుక్ చేసుకుంటే బెటరా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

