Elon Musk on Twitter | ఇప్పటికీ మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికే కట్టుబడి ఉన్నామని టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ ప్రకటించారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన కొన్ని గంటలకే మస్క్ మాట మార్చారు.
ట్విట్టర్లో ఐదు శాతానికంటే ఎక్కువగా ఫేక్, స్ఫామ్ ఖాతాలు ఉండటం పట్ల ఆందోళన నేపథ్యంలోనే ఆ సంస్థ టేకోవర్ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన బెట్టినట్లు శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ట్విట్టర్ నుంచి స్పామ్ ఖాతాలను పూర్తిగా తొలగించడమే తన ప్రాధాన్యం అని ఎలన్‌మస్క్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం మస్క్ చేసిన ట్వీట్‌తో వాల్ స్ట్రీట్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ట్విట్టర్ షేర్లు 20 శాతం నష్టపోయాయి. టెస్లా షేర్లు పుంజుకున్నాయి. ఏప్రిల్ 25న ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధం అని మస్క్ ప్రతిపాదించారు.