Elon Musk | టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 210 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అయితే, గురువారం మాత్రం ఆయన సంపద భారీగా ఆవిరైపోయింది. ఒక్కరోజులోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.30 లక్షల కోట్లు అన్నమాట.
టెస్లా (Tesla) షేర్లు భారీగా పతనమవడమే మస్క్ సంపద ఆవిరవ్వడానికి ప్రధాన కారణం. 2023-24 మూడో త్రైమాసికం జులై-సెప్టెంబర్‌కి సంబంధించి టెస్లా సంస్థ ఆశించిన మేర రాణించలేకపోయింది. ఈ ఫలితాలు మదుపర్లను తీవ్ర నిరాశపరిచాయి. దీంతో గురువారం కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు 9.3 శాతం మేర పతనమయ్యాయి. దీంతో సంస్థలో 13 శాతం వాటాలున్న మస్క్ భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
Also Read..
Canada | భారత్‌లోని కెనడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. అడ్వైజరీ జారీ చేసిన ట్రూడో ప్రభుత్వం
Raj Kundra | రాజ్‌కుంద్రా సంచలన ప్రకటన.. మేము విడిపోతున్నాం అంటూ పోస్ట్
Virat Kohli | కోహ్లీ అసాధారణ ఫీట్.. ఒక్క బంతికే 14 రన్స్ కొట్టిన విరాట్