Elon Musk | సాం ఆల్ట్‌మాన్‌ను ఎందుకు తొలగించారనేది ప్రజలకు వివరించాలి : ఓపెన్ఏఐ నిర్ణయంపై మస్క్ ఫైర్
సామ్ ఆల్ట్‌మాన్‌పై వేటు వేసేందుకు కారణం ఏంటనేది ఓపెన్ఏఐ వెల్లడించాలని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) కోరారు.
న్యూయార్క్ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ లాంఛ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓపెన్ఏఐ సీఈవో సాం ఆల్ట్‌మన్‌ను కంపెనీ అర్ధంతరంగా తొలగించడం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. సామ్ ఆల్ట్‌మాన్‌పై వేటు వేసేందుకు కారణం ఏంటనేది ఓపెన్ఏఐ వెల్లడించాలని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) కోరారు.
ఆల్ట్మాన్ నిష్క్రమణపై మస్క్ స్పందిస్తూ సాం ఆల్ట్‌మాన్‌ను ఓపెన్ఏఐ నుంచి తొలగించడం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని అన్నారు. ఆల్ట్‌మాన్‌ను ఎందుకు తొలగించారనే సహేతుక కారణాలను ఓపెన్ఏఐ ప్రజల ముందుంచాలని, ఈ విషయంలో ప్రజలకు తెలియని విషయాలు ఏవో ఉన్నాయని మస్క్ సందేహం వ్యక్తం చేశారు. ఓపెన్ఏఐ ఏదో దాస్తున్నదని అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
ఓపెన్ఏఐ ఎందుకు తన సీఈవోను తొలగించిందనేది ప్రజలకు తెలియచేయాలని అన్నారు. అడ్వాన్స్డ్ ఏఐకున్న శక్తి, దాని వల్ల పొంచిఉన్న ముప్పు దృష్ట్యా ఆల్ట్‌మాన్‌పై ఎందుకు వేటు వేయాల్సివచ్చిందనేది ఓపెన్ఏఐ ప్రజలకు బహిర్గతం చేయాలని మస్క్ పట్టుబట్టారు. కంపెనీ బోర్డు ఇలాంటి అనూహ్య నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనేది ప్రజలకు వివరించాలని ట్విట్టర్ వేదికగా మస్క్ కోరారు.
Read More :
Sam Altman – OpenAI | పునరాలోచనలో ఓపెన్ఏఐ.. ఆల్టమన్‌ను పున:నియమిస్తారా..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ceo
- Elon Musk
- OpenAI
- Sam Altman
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

