ఐషర్ మోటార్స్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విద్యా శ్రీనివాసన్‌ను నియమించింది. ఈ రోజు (నవంబర్ 18వ తేదీ) నుంచే ఆమె విధుల్లో చేరనున్నారు. ఐషర్ మోటార్స్‌లో చేరడానికి ముందు బాటా ఇండియాలో డైరెక్టర్‌గా, చీఫ్ ఫైనాన్షియాల్ ఆఫీసర్‌గా విద్యా పనిచేశారు. ఆమె గతంలో ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్, గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్, పుమా స్పోర్ట్స్ ఇండియా వంటి కంపెనీల్లో పనిచేశారు.
మద్రాస్ యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశాక విద్యా చార్టెడ్ అకౌంట్ చదివారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా చేశారు. ఆమెకు ఆర్థికం, వ్యాపార ప్రణాళికలు, న్యాయపరమైన విషయాల్లో 24 ఏళ్ల అనుభవం ఉంది.
విక్రమ్ లాల్ అనే వ్యాపారవేత్త 1948లో ఐషర్ మోటార్స్‌ని స్థాపించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల తయారీ కంపెనీకి ఐషర్ పేరెంట్ కంపెనీ. ప్రస్తుతం సిద్ధార్థ లాల్ ఐషర్ మోటార్స్ సీఈవోగా ఉన్నాడు.