హైదరాబాద్, ఏప్రిల్ 10: రాయ్ డీఎస్ఎం..హైదరాబాద్లో నూతన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా, విస్తృత శ్రేణిలో పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇది తొలి, వినూత్న తరహా వాణిజ్య తయారీ కేంద్రమని, నాణ్యత కలిగిన ఉత్పత్తి ప్రక్రియలను వినియోగించుకొని పోషక విలువలతో కూడిన బియ్యం గింజలను ఉత్పత్తి చేస్తున్నది. సంవత్సరానికి 3,600 టన్నుల కెన్నల్స్ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఈ ప్లాంట్ను అభివృద్ధి చేస్తున్నది.