December Deadlines | కేంద్రం సంక్షేమ పథకాలు మొదలు ఆధార్ అప్డేట్, డీమ్యాట్ ఖాతాలకు నామినీల పేర్లు, వివరాలు ఇవ్వడానికి వచ్చేనెలాఖరుతో గడువు ముగియనున్నది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి డిసెంబర్ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. ఎనిమిది మనీ డెడ్ లైన్లు వచ్చేనెలాఖరుతో ముగుస్తాయి. కనుక ఈ నెలాఖరులోగా మీరు ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో కేంద్ర పథకాల నుంచి లబ్ధి పొందలేరు. డీమ్యాట్ ఖాతాలు ఫ్రీజ్ చేస్తారు. ఆధార్ అప్డేట్ ఇవ్వకున్నా ఖాతా ఇన్ ఆపరేటివ్ అవుతుంది.
పరిమిత కాల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్ (SBI Amrit Kalash)’ పథకం గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగిసిపోతుంది. ఈ స్కీం కింద టర్మ్ డిపాజిట్లపై 7.10 శాతం కంటే ఎక్కువ వడ్డీ అందిస్తున్నది ఎస్బీఐ.
హోంలోన్ తీసుకునే ఖాతాదారులకు ఎస్బీఐ స్పెషలాఫర్ తెచ్చింది. హోంలోన్లపై గరిష్టంగా కల్పించిన 65 బేసిక్ పాయింట్ల రాయితీ వచ్చేనెల 31తో ముగుస్తుంది.
ఇక వివిధ బ్యాంకులతో ఖాతాదారులు చేసుకున్న లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్ గడువు కూడా వచ్చేనెలతోనే ముగుస్తుంది. గతేడాది డిసెంబర్ నెలాఖరులోపు లాకర్ అగ్రిమెంట్ చేసుకున్నవారు మరోమారు వచ్చేనెలాఖరులోగా బ్యాంకర్లతో తమ లాకర్ అగ్రిమెంట్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటది.
పదేండ్లుగా ఆధార్ అప్డేట్ చేసుకోని వారి కోసం భారత్ విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) అవకాశం ఇచ్చింది. ఆ గడువు డిసెంబర్ 14తో ముగుస్తుంది. అటుపై ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 పే చేయాలి.
మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలకు వచ్చేనెలాఖరులో నామినీ వివరాలు జత చేయడానికి సెబీ గడువు విధించింది. పాన్ కార్డు, నామినీ పేరు, ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు వచ్చే నెలాఖరుతో ముగుస్తుంది. సమర్పించకపోతే మీ ఖాతాలు స్తంభించిపోతాయని ఇప్పటికే సెబీ హెచ్చరించింది.
ఏడాది కాలానికి పైగా వినియోగించని యూపీఐ ఐడీలు, నంబర్లు డీయాక్టివేట్ చేయాలని గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, బ్యాంకులను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కోరింది. వచ్చే నెలాఖరులోగా ఆ యూపీఐ ఐడీలను థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు డీయాక్టివేట్ చేయాలని పేర్కొంది.
ఐడీఐబీఐ అమృత్ మహోత్సవ్ పేరుతో ఐడీబీఐ బ్యాంక్.. 375 రోజులు, 444 రోజుల గడువుతో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తెచ్చింది. వీటికి కూడా వచ్చేనెల 31తో గడువు ముగుస్తుంది. ఇంకా ‘ఇండ్ సూపర్ 400’, ‘ఇండ్ సూపర్ 300 డేస్’ పేరుతో ఇండియన్ బ్యాంకు తెచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల గడువు కూడా అదే రోజు ముగుస్తుంది.