ముంబై, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు రియల్టీ, ఆయిల్అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడంతో సూచీలు చివరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. వారాంతపు ట్రేడింగ్‌లో ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 329.92 పాయింట్లు నష్టపోయి 76,190.46 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 113.15 పాయింట్లు కోల్పోయి 23,092.20 వద్ద పరిమితమైంది. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 428.87 పాయింట్లు, నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, జొమాటో, టాటా మోటర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎల్అండ్టీ, ఉల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు నష్టపోయాయి. కానీ, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, నెస్లె, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లాభాల్లో ముగిశాయి.