న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ.. ఐడీబీఐ బ్యాంక్‌తో జతకట్టింది. డీలర్లకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంక్‌తో మారుతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల విక్రయ అవుట్లెట్ల విస్తరణకు అవసరమైన రుణాలు ఐడీబీఐ ఇవ్వనున్నట్టు మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.