Home Loan Pre-Payment | ఇంటి రుణం ప్రీ-పేమెంట్ ఏయే పరిస్థితుల్లో చేయొచ్చో తెలుసా..!
Home Loan Pre-Payment | ఇంటి రుణంపై ముందస్తు పేమెంట్స్ చేసేవారు పన్ను నిపుణుల సూచనలు తీసుకుంటే బావుంటుందని ఆర్థికవేత్తలంటున్నారు.
Home Loan Pre-Payment | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ సొంతింటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణ పరపతి కల్పిస్తుండటంతో చేతిలో సరిపడా డబ్బు లేకున్నా మెజారిటీ ప్రజలు రుణాలతో సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. కేవలం ఇండ్లు కొనడమే కాదు.. ప్రస్తుత ఇంటి విస్తరణ, మరమ్మతు, పునరుద్ధరణ వంటి పనులకు కూడా బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఈ రుణాలను నెలవాయిదా (ఈఎంఐ) పద్దతిలో చెల్లించడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. రుణ గ్రహీతలు తీసుకునే రుణాన్ని, వారి ఆదాయ వనరులను అంటే వారి చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ రుణాల చెల్లింపునకు పదేండ్ల నుంచి 30 ఏండ్ల గడువు పెడుతున్నాయి.
నిబద్ధతతోనే హోంలోన్ పేమెంట్
బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ద్వారా రుణం తీసుకుని సొంతింటి కల సాకారం చేసుకున్నవారు తర్వాత చేతిలో డబ్బు ఉంటే కాల పరిమితికి ముందే కొంత మొత్తం గానీ, పూర్తిగా రుణం గానీ చెల్లించేయొచ్చు. అలా కాల పరిమితికి ముందు ఇండ్ల రుణాలు చెల్లించేవారు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. సొంతిల్లు అనేది జీవిత కాల లక్ష్యం. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు. కనుక ఇంటి రుణం కూడా సుదీర్ఘ టెన్యూర్‌తో వస్తుంది. కనుక ఇండ్ల రుణ వాయిదా చెల్లింపులు చేయడానికి ఆర్థిక నిబద్ధత కలిగి ఉండటం ఎంతైనా అవసరం.
రుణంలో అసలు కంటే వడ్డీ ఎక్కువ
20-30 ఏండ్ల గడువుతో ఇండ్ల రుణం తీసుకునే వారు.. అసలుతో సమానంగా వడ్డీ చెల్లించాల్సిందే. కొన్ని సందర్భాల్లో అసలు కంటే వడ్డీ చెల్లింపులే ఎక్కువ ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు చెల్లింపులు జరపడం ద్వారా ఈఎంఐ భారం, పేమెంట్స్ టెన్యూర్ గడువు తగ్గించుకోవచ్చు. రుణ గడువు తగ్గించుకుంటే నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లింపు యధాతథంగా ఉంటుంది. చెల్లించాల్సిన అసలు తగ్గడంతో త్వరితగతిన మొత్తం రుణం పేమెంట్ పూర్తి చేయడానికి వీలు చిక్కుతుంది. అలా కాక ఈఎంఐ తగ్గించుకుంటే, మీ రోజువారీ ఖర్చులకు ఎక్కువ మొత్తం డబ్బు మిగులుతుంది. అయితే, రుణ గ్రహీతలు తమ కుటుంబ అవసరాలు, అనుకూల పరిస్థితులను బట్టి ఓ నిర్ణయానికి రావచ్చు.
ఇంటి రుణంపై పన్ను చెల్లింపుతో పన్ను ఆదా
ఇంటి రుణంపై ఆదాయం పన్ను ఆదా చేయొచ్చు. ఒకవేళ ప్రీ-పేమెంట్ చేసినా.. మీ వడ్డీ చెల్లింపులపై ఆదా చేసుకునే పన్ను మొత్తం తగ్గే అవకాశం ఉంది. కనుక ప్రీ-పేమెంట్ నిర్ణయం తీసుకునే ముందు టాక్స్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలు తెలుసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఇంటి రుణం తీసుకున్న మొదట్లోనే ప్రీ-పేమెంట్స్ లాభదాయకం. ప్రారంభంలో జరిపే పేమెంట్ ఈఎంఐలో అసలు తక్కువగా, వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కనుక రుణం తీసుకున్న మొదట్లోనే ప్రీ-పేమెంట్ చేయడంతో వడ్డీ మొత్తం ఆదా చేయొచ్చు. అలా కాకుండా రుణం చివర్లో ప్రీ-పేమెంట్స్ చేయడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉండకపోవచ్చు. దీనికి తోడు పన్ను ఆదా బెనిఫిట్లు వదులుకోవాల్సి వస్తుంది.
ఎమర్జెన్సీ ఫండ్.. దీర్ఘకాలిక స్కీమ్స్‌లో మదుపు
అయితే, ఒక్క విషయం. ఇంటి రుణం ప్రీ-పేమెంట్ చేయడానికి, ఇతర లక్ష్యాలు, అవసరాలకు దాచి ఉంచిన సొమ్ము ఉపయోగించడం సరైన చర్య కాదు. కుటుంబ అవసరాలకు మీరు పక్కన బెట్టిన ఎమర్జెన్సీ ఫండ్.. హోంలోన్ ప్రీ-పేమెంట్ చేస్తే.. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రిటైర్మెంట్, పిల్లల విద్యాభ్యాసం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ మధ్యలో నిలిపేసి హోంలోన్ ప్రీ-పేమెంట్ చేయడమూ మంచిది కాదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాలు మీ కుటుంబ దీర్ఘకాలిక లక్ష్యాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం కూడా చూపొచ్చు.
ఫ్లోటింగ్ రేట్లపై రుణాల ముందస్తు పేమెంట్స్ ఈజీ
ఇండ్ల రుణాలను ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్నవారు ప్రీ-పేమెంట్స్ కోసం ఎటువంటి పెనాల్టీలు పే చేయక్కర్లేదు. హిడెన్ చార్జీలేమైనా ఉన్నాయా? అన్న సంగతి తెలుసుకునేందుకు లోన్ రూల్స్, కండీషన్స్ తెలుసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఒకవేళ, ఏ రూపంలోనైనా భారీ మొత్తంలో డబ్బు లభించినా, ఇన్‌కం పెరిగినా.. హోంలోన్ ప్రీ-పేమెంట్స్ కోసం కొంత ఉపయోగించి, బెస్ట్ రిటర్న్స్ గల పొదుపు-ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్‌గా ఉంటుందని చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

