Maruti Suzuki Baleno | ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.62,100 డిస్కౌంట్.. అది హ్యుండాయ్ ఐ20.. టాటా ఆల్ట్రోజ్.. టయోటా గ్లాన్జా కాదు.. !
Maruti Suzuki Baleno | ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో రారాజుగా నిలిచిన మారుతి సుజుకి బాలెనోపై జూన్ నెలలో రూ.62,100 వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Maruti Suzuki Baleno | ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎస్యూవీ కార్లకు ఫుల్ గిరాకీ ఉన్నా, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్స్ కూడా గణనీయ స్థాయిలోనే అమ్ముడవుతున్నాయి. వాటిల్లో హ్యుండాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాన్జా వంటి కార్లు టాప్ లో నిలిచాయి. సుదీర్ఘ కాలంగా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లలో లీడర్‌గా ఉంది మారుతి సుజుకి బాలెనో. బాలెనో విక్రయాలు పెంచుకునేందుకు మారుతి సుజుకి జూన్ లో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. బాలెనో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ మీద రూ.57,100, ఎఎంటీ వేరియంట్ మీద రూ.62,100, సీఎన్జీ వేరియంట్ మీద రూ.47,100 డిస్కౌంట్ అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో రెండో స్థానంలో నిలిచిందీ బాలెనో. 2023-24లో 1,95,607 యూనిట్లు విక్రయించారు. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లలో బాలెనో టాప్ లో నిలిచింది.
వేరియంట్ల వారీగా మారుతి సుజుకి బాలెనో ధర వరలు ఇలా
సిగ్మా ఎంటీ – రూ.6.66 లక్షలు
డెల్టా ఎంటీ – రూ.7.50 లక్షలు
డెల్టా ఏఎంటీ – రూ.8 లక్షలు
డెల్టా ఎంటీ సీఎన్జీ – రూ.8.40 లక్షలు
జెటా ఎంటీ – రూ.8.43 లక్షలు
జెటా ఏఎంటీ – రూ.8.93 లక్షలు
జెటా ఎంటీ సీఎన్జీ – రూ.9.33 లక్షలు
ఆల్ఫా ఎంటీ – రూ.9.38 లక్షలు
ఆల్ఫా ఎఎంటీ – రూ.9.88 లక్షలు
మారుతి సుజుకి బాలెనో 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 89.7 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తోంది. సీఎన్జీ ఆప్షన్ ఇంజిన్ గరిష్టంగా 77.4 పీఎస్ విద్యుత్, 98.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తున్నది. పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, సీఎన్జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి బాలెనో కారు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్.. లీటర్ పెట్రోల్ మీద 22.9 కి.మీ మైలేజీ ఇస్తే, సీఎన్జీ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ కిలో సీఎన్జీపై 30.61 కి.మీ మైలేజీ అందిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్‌యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

