Online Gaming Sites | ఆన్లైన్ గేమింగ్ వెబ్‌సైట్స్‌పై కేంద్రం కొరడా.. 357 వెబ్‌సైట్స్ బ్లాక్..!
Online Gaming Sites | ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమ ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్సైట్లను బ్లాక్ చేశారని.. దాదాపు 2,400 బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేసినట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Online Gaming Sites | ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమ ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్సైట్లను బ్లాక్ చేశారని.. దాదాపు 2,400 బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేసినట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో అప్రమత్తంగా ఉండాలని.. వాటిని ఎవరూ వినియోగించొద్దని డీజీజీఐ సూచించింది. కొన్ని సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాన్ని దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకున్నామని.. 357 వైబ్‌సైట్స్‌ని ఐటీశాఖ సమన్వయంతో బ్లాక్ చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతోన్న సుమారు 700 సంస్థలపై నిఘా వేసినట్లు పేర్కొంది.
దేశం వెలుపల ఈ తరహా సంస్థలు నడుపుతోన్న పలువురు భారతీయులపై డీజీజీఐ మరో ఆపరేషన్ చేపట్టి.. వారికి సంబంధించిన 166 ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నది. చాలామంది బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొంది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆ ప్లాట్‌ఫామ్స్ వ్యక్తుల ఆర్థిక భద్రతను దెబ్బతీసే అవకాశం ఉందని.. దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఆన్లైన్ గేమింగ్‌కు 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఈ రంగంలో పని చేస్తున్న సంస్థలు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌తో సహా చట్టవిరుద్ధమైన గేమింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

