DGCA | ఆ మూడు ఎయిర్ లైన్స్ మీద డీజీసీఏ చర్యలు.. ఎయిరిండియాకు రూ.10 లక్షల ఫైన్
DGCA | ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ సంస్థల్లో వేర్వేరు లోపాల కారణంగా ఆయా సంస్థలపై డీజీసీఏ చర్యలకు ఉపక్రమించింది.
DGCA | దేశంలోని మూడు ఎయిర్ లైన్స్ మీద పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆకాశ, స్పెస్ జెట్ సంస్థల్లో వేర్వేరు లోపాల కారణంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. ఎయిర్ ఇండియాపై రూ.10 లక్షల జరిమాన విధించింది. ఆకాశ ఎయిర్ సంస్థ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆకాశ ఎయిర్ ‘ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఆల్ కెమిస్ట్ ఏవియేషన్’ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేసింది.
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ విమాన సర్వీసులు తగ్గించిన స్పైస్ జెట్ పై నిఘా పెంచింది. స్పాట్ చెక్స్, నైట్ నిఘా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన స్పెషల్ అడిట్ లో కొన్ని లోపాలు ఉన్నట్లు డీజీసీఏ నిర్ణయించింది. ఇక విమాన సర్వీసులు రద్దు చేసిన ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థపై రూ.10 లక్షల జరిమాన విధించింది.
ఆకాశ ఎయిర్ పలు రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇటీవల నిర్వహించిన సమీక్షలో డీజీసీఏ నిర్ధారణకు వచ్చింది. ఈ విషయమై సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. సిబ్బందికి ప్రాక్టికల్ ట్రైనింగ్ సెషన్లు నిర్వహించినా, ఆకాశ ఎయిర్ వాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ పొందడంలో లేదని డీజీసీఏ గుర్తించింది. ఆకాశ ఎయిర్ ట్రైనింగ్ సంస్థ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ లోపాన్ని సరి చేయకపోవడంతో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ట్రైనీ పైలట్, ఆన్ బోర్డ్ ఇన్ స్ట్రక్టర్ మరణించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

