న్యూఢిల్లీ, జూలై 19: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఫోల్డబుల్ ఫోన్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం 48 గంటల్లోనే 2.1 లక్షలకు పైగా బుకింగ్లు వచ్చాయని పేర్కొంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ స్మార్ట్ఫ్లోను ఏడో జనరేషన్గా విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లు రూ. 89 వేలు మొదలుకొని రూ.2.11 లక్షల లోపు లభించనున్నాయి. వీటిలో జెడ్ ఫోల్డ్ 7 ప్రారంభ ధర రూ.1.75 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.11 లక్షలుగా నిర్ణయించింది. అలాగే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 మాడల్ రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల లోపు లభించనున్నాయి. ఈ సందర్భంగా సామ్సంగ్ సౌత్వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ మాట్లాడుతూ..దేశీయంగా తయారైన ఈ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
ఎల్అండ్టీ బాస్ వేతనం హైజంప్
న్యూఢిల్లీ, జూలై 19: దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.76 కోట్ల వార్షికవేతనాన్ని అందుకున్నారు. అంతక్రితం ఏడాది పొందిన వేతనం కంటే ఇది 50 శా తం అధికం కావడం విశేషం. స్టాక్ ఆప్షన్ కింద అధిక మొత్తంలో వేత నం లభించడం వల్లనే భారీగా పెరిగిందని తెలిపింది. స్టాక్ ఆఫ్ ఆప్షన్ కింద గతేడాది ఆయన రూ.15.88 కోట్ల మేర ప్రయోజనం పొందారు. అలాగే కంపెనీ డైరెక్టర్, సీఎఫ్వో ఆర్ శంకర్ రూ.37.33 కోట్ల వేతనం పొందగా, డిప్యూటీ ఎండీ, ప్రెసిడెంట్ సుబ్రమణియన్ శర్మ రూ.44.55 కోట్లు అందుకున్నారు.