Bit Coin | బిట్‌కాయిన్ @22,507.. భారీగా పతనమౌతున్న క్రిప్టోలు!
Bit Coin | బిట్‌కాయిన్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు 22,507 డాలర్ల వద్ద స్థిర పడింది. ఎథేర్ 8 శాతానికి పైగా నష్టపోయింది.
Bit Coin | క్రిప్టో కరెన్సీల పతనం మంగళవారం కూడా కొనసాగింది. మంగళవారం క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో ఇంట్రాడే ట్రేడింగ్‌లో క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ విలువ భారీగా పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు మదుపు చేసిన వేల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. తమ కస్టమర్లు ఖాతాల నుంచి నగదు విత్‌డ్రాయల్స్, బదిలీలను నిలిపేస్తున్నట్లు క్రిప్టో లెండింగ్ సంస్థ సెల్సియస్ నెట్వర్క్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. మదుపర్లు అమ్మకాలకు దిగడంతో బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీలన్నీ పతనం అయ్యాయి.
మంగళవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో బిట్ కాయిన్ విలువ 10 శాతం పతనమై 22,765 డాలర్లకు పడిపోయింది. సాయంత్రం నాలుగు గంటలకు 22,507 డాలర్లకు చేరుకుంది. గతేడాది నవంబర్‌లో బిట్ కాయిన్ 69వేల డాలర్ల ఆల్‌టైం రికార్డు పలికింది. నాటి నుంచి ఇప్పటి వరకు బిట్ కాయిన్ విలువ 66 శాతం పతనమైంది. 12 వారాలుగా బిట్‌కాయిన్ నష్టపోతూనే వచ్చింది. గత ఏడు రోజుల్లో 24 శాతానికి పైగా విలువను కోల్పోయింది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ విలువ 6 శాతానికి పైగా నష్టపోయింది. క్రిప్టోల మార్కెట్ క్యాపిటలైజేషన్లో బిట్ కాయిన్ 45.29 శాతం.
బిట్‌కాయిన్ తర్వాతీ స్థానంలో ఉన్న ఎథేర్ సైతం 8 శాతం నష్టపోయి 1225 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. గతేడాది జనవరి నుంచి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం క్రిప్టో గ్లోబల్ ఎం-క్యాప్ 944.78 బిలియన్ల డాలర్లు. గత 24 గంటల్లో 3.57 శాతం నష్టపోయిందని కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా తెలిపింది.
అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, త్వరలో యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర అంశాలతో క్రిప్టో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనపడుతున్నది.
17 లక్షల మంది కస్టమర్లు గల క్రిప్టో లెండింగ్ సంస్థ సెల్సియస్ నెట్వర్క్.. నిధుల విత్‌డ్రాయల్స్, బదిలీల ప్రక్రియ నిలిపేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు పునఃప్రారంభిస్తారో వెల్లడించలేదు. 10 బిలియన్ల డాలర్ల ఆస్తులు గల సెల్సియస్ నెట్వర్క్.. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల వల్లే ట్రేడింగ్ నిలిపివేసినట్లు కనిపిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

