Bit Coin | 23 వేల డాలర్ల వద్ద బిట్‌కాయిన్.. ఎథీరియం విలీనం ముచ్చట్లు
Bit Coin | గతవారం బిట్ కాయిన్ 23 వేల డాలర్ల వద్ద ట్రేడయింది. రెండో క్రిప్టో కరెన్సీ ఎథీరియం విలీనంపై చర్చలు జరుగుతున్నాయి.
Bit Coin | సంప్రదాయ మార్కెట్లలో అనిశ్చితితో పలు క్రిప్టో కరెన్సీలు స్వల్పంగా సర్దుబాటుకు గురయ్యాయి. స్వలంగా పతనమైనా క్రిప్టో కరెన్సీలు తిరిగి పుంజుకున్నాయి. గతవారం యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడం, చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 23 వేల డాలర్లకు దూసుకెళ్లినా.. తిరిగి 22 వేల డాలర్లకు పడిపోయింది. కానీ వారాంతంలో 23 వేల డాలర్ల మార్క్‌ను అందుకున్నది. బిట్‌కాయిన్ తర్వాతీ స్థానంలో ఉన్న ఎథీరియం వచ్చే నెలలో విలీనం దిశగా అడుగులేస్తున్నట్లు సమాచారం.
సెకండ్ క్రిప్టో కరెన్సీ ఎథీరియం గతవారం మధ్యలో 1500 డాలర్లకు పడిపోయినా శుక్రవారం 1700 డాలర్లకు పుంజుకున్నది. ఇదిలా ఉంటే, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్.. తమ బినాన్స్ కార్డు ద్వారా ఎక్స్ఆర్పీ, శిబా ఇను, అవలాంచె వంటి క్రిప్టో కరెన్సీల చెల్లింపులు చేస్తామని తెలిపింది. ఇప్పటికేతై ఉక్రెయిన్ శరణార్థులు, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా వాసులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని బినాన్స్ పేర్కొన్నది.
అమెరికన్ ఇన్వెస్టర్లలో దాదాపు 39 శాతం మంది పలు క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేశారని ఓ సర్వేలో తేలిందని `ది బ్యాలెన్స్` వార్తాకథనం ప్రచురించింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు నూతన మార్గాలను అన్వేషిస్తూ.. తమ సంపద కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయ ఇన్వెస్టర్లు కూడా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు మదుపు చేస్తున్నారని ఈ సర్వే సారాంశం. .
ఆగస్టు 7 వరకు గత వారంలో భారీగా లబ్ధి పొందిన క్రిప్టో కరెన్సీలివే..!
1.డిక్రీడ్ (డీసీఆర్) : 46% వృద్ధి
2. ఫ్లో (FLOW): 36% లాభం
3. ట్రస్ట్ వాలెట్ టోకెన్ (టీడబ్ల్యూటీ) : 20శాతం పెరుగుదల
4. ఆప్టిమిజం (ఓపీ): 17% శాతం
5. క్వాంట్ (క్యూఎన్టీ) : 17% శాతం
భారీగా నష్టపోయిన క్రిప్టో టోకెన్లు ఇవే
1. బిట్ కాయిన్ గోల్డ్ (బీటీజీ): 16% నష్టం
2. సొలానా (సొల్): 9% పతనం
3. హీలియం (హెచ్ఎన్టీ): 9% నష్టం
4. కాన్వెక్స్ ఫైనాన్స్ (సీవీఎక్స్): 8% పతనం
5. ది గ్రాఫ్ (జీఆర్టీ): 7% నష్టం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

